రాహూల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు...?

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (06:55 IST)
కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో భారీ మార్పులు తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది. కీలక సమయంలో రాహూల్ పార్లమెంటుకు రాకపోవడంతో దీనిని మరింత బలపరుస్తోంది. త్వరలో జరగబోవు సంస్థాగత ఎన్నికలలో రాహూల్ అధ్యక్షుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా ఎక్కడా కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేయడం లేదు. తన తప్పుకుని తనయుడికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సోనియా సిద్ధపడుతున్నాట్లు సమచారం వివరాలిలా ఉన్నాయి. 
 
 
పార్టీ చీఫ్ గా సోనియాగాంధీ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్నది.  ఏఐసిసికి ఏప్రిల్‌లో జరగబోయే సదస్సులోనే అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ సదస్సులో రాహుల్‌ను సింహాసనం ఎక్కిస్తారని తెలుస్తోంది. స్పష్టత లేకపోయినప్పటికీ ఈ ఏడాదే పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశాలను కాంగ్రెస్ వర్గాలు కొట్టివేయలేదు. సోనియా 1998 నుంచీ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. 
 
ఇక రాహూల్ ను ఇప్పటికే అంచెలంచెలుగా పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి ఉపాధ్యక్ష పదవిలోకి తీసుకువచ్చారు. పార్టీ ప్రస్తుతం పూర్తి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాహుల్ ను పార్టీ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి