చెన్నై రైల్వే స్టేషన్లు, రైళ్లలో సెల్ఫీలు తీసుకునేందుకు నిషేధం విధిస్తున్నట్లు జీఆర్పీ ప్రకటించింది. ఎవరైనా తమ ఆదేశాల్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల యువకుడు కదులుతున్న రైలులో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడని, రెండు నెలల తర్వాత కోమా నుంచి బయటపడిన అనంతరం ఆ యువకుడ్ని పార్థసారథిగా గుర్తించినట్లు పోలీసులు వివరించారు.