రామమందిర ప్రారంభోత్సవం - 108 అడుగుల అగర్‌బత్తీ తయారీ

గురువారం, 21 డిశెంబరు 2023 (09:08 IST)
అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లుసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కోసం ఏకంగా 108 అడుగుల పొడవున్న అగర్‌బత్తీని తయారు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఈ భారీ అగర్‌బత్తీని సిద్ధం చేస్తున్నారు. కాగా, జనవరి 22వ తేదీన ఈ రామాలయ ప్రారంభోత్సవ ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అయోధ్యలో పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పిస్తున్నారు. పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదినక పూర్తి చేస్తున్నారు. నగరంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఫేజ్-1 ప్రాజెక్టు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానుంది. 
 
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన అనుబంధ బడ్జెట్‌లో అయోధ్య అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయోధ్య కన్సర్వేషన్, డెవలప్‌మెంట్ ఫండ్‌కు రూ.50 కోట్లు, రామోత్సవ్‌ 2023-24కు రూ.100 కోట్లు, ఇంటర్నేషనల్ రామాయణ్, వైదిక్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్‌ విస్తరణకు రూ.25 కోట్లు చొప్పున కేటాయించారు. 

వెబ్దునియా పై చదవండి