అయితే, అయోధ్య రామ మందిర పూజా కార్యక్రమాలను ఈయనే స్వయంగా దగ్గరుండి నిర్వహించారు. ప్రధాని మోడీతో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు. కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నృత్యగోపాల్ దాస్ ప్రస్తుతంలో మథురలో ఉంటున్నారు.
రామాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందిబెన్‌తో పాటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు వేదికపై కనపడ్డారు. కాగా, భూమిపూజకు ముందు కూడా ఆలయ పూజారి ప్రదీప్‌దాస్‌తో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి కరోనా సోకిన సంగతి విదితమే.
అయితే, నృత్యగోపాల్ దాస్‌కు కరోనా వైరస్ సోకడంతో ఈయనతో కలిసి రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటారా? లేదా? అనేది తేలాల్సివుంది. ప్రధాని మోడీ సైతం హోం క్వారంటైన్‌కు వెళతరా? లేదా? తెలియాల్సివుంది.