ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా రామాలయం అంశం తెరపైకి వచ్చింది. లాలీపాప్తో సంతోషించలేమనీ, రామాలయం కావాల్సిందేనంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అన్నారు.
వివాదాస్పద బాబ్రీమసీదు - రామజన్మభూమి స్థలానికి 15 కిలోమీటర్ల దూరంలో రామాయణ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై సొంత పార్టీ ఎంపీ నుంచే బీజేపీ తాజాగా విమర్శలు ఎదుర్కొంది. మ్యూజియం ఏర్పాటు నిర్ణయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వినయ్ కతియార్ 'లాలీపాప్'తో పోల్చారు. 'మనం రామమందిరం నిర్మాణానికి ప్రయత్నించాలి. లాలీపాప్తో సంతోషించలేం' అని కతియార్ వ్యాఖ్యానించారు.
ఈ యేడాది ప్రారంభంలో ఈ అంశాన్ని సుబ్రమణియం స్వామి రాజ్యసభలోనూ లేవనెత్తారు. సమస్య పరిష్కారానికి రోజువారీ విచారణ జరపాలని కూడా స్వామి అప్పట్లో డిమాండ్ చేసారు. రెండ్రోజుల క్రితం కూడా సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ, 2017 ఎన్నికల్లో గెలవాలంటే రామాలయం అంశం కీలకమని అన్నారనీ గుర్తు చేశారు. అందువల్ల ఖచ్చితంగా రామాలయ నిర్మాణం చేపట్టాల్సిందేనని ఆయన గుర్తుచేశారు.