తమిళనాడు ఈరోడ్డులోని ఓ యువతి హాస్టల్లో ఉంటూ ఏడాదిగా ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే జులై 28వ తేదీన హాస్టల్ రూమ్లో కాళ్లు చేతులు బంధించబడి ఉన్న యువతిని చూసిన హాస్టల్ సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని తెలిపింది. దాంతో వారు శరవణంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతిని ప్రశ్నంచగా, ఆమె పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించారు.