పెళ్లి గొప్పతనం గురించి తెలుసుకున్నారు.. మళ్లీ కోర్టులోనే పెళ్లి..!

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:31 IST)
విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన జంటకు కోర్టులోనే మళ్లీ పెళ్లి జరిగింది. ఈ ఘటన ఒడిశాలోని జయపురం కోర్టులో చోటుచేసుకుంది. పాత్ర పుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి హోతా అనే వ్యక్తి 2016లో అనిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. దాంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
 
ఈ కేసుపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. అయితే కోర్టులో పెళ్లి గురించి… పెళ్లి గొప్పతనం గురించి పెద్దలు ఆ జంటకు వివరించారు. దాంతో విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్న ఆ జంట కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దాంతో మళ్ళీ వారిద్దరికీ కోర్టులో పెళ్లి చేశారు. ఇద్దరూ కలిసి ఉండేందుకు ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు కూడా ఆనందం వ్యక్తం చేశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు