'ఫ్రీడం 251' ఫోన్లు పంపిణీ చేయకుంటే కటకటాల వెనక్కే : ఐటీ మంత్రి రవిశంకర్

బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (11:41 IST)
ముందుగా ప్రకటించినట్టుగా ఫ్రీడం 251 ఫోన్లు నాలుగు నెలల తర్వాత పంపిణీ చేయకుంటే కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. పైగా.. ఈ మొబైల్స్ తయారీ కంపెనీ రింగింగ్ బెల్స్‌పై ఓ కన్నేసి ఉంచినట్టు ఆయన తెలిపారు. 
 
ఫ్రీడం స్మార్ట్ ఫోన్లపై ఆయన స్పందిస్తూ... ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఈ కంపెనీ చౌక హ్యాండ్‌సెట్లను పంపిణీ చేయడంలో విఫలమైతే చర్యలకు వెనుకాడబోమన్నారు. 'వారు పంపిణీ విషయంలో ఎలా సన్నద్ధమయ్యారన్నదానిపై వాకబు చేస్తోంది. రూ.251 ధరకు ఫోన్లను అందించగలదా లేదా అని పరిశీలిస్తోంది. వారికి బీఐఎస్‌ సర్టిఫికేట్‌ ఉందా లేదా అన్న విషయాన్ని గమనిస్తామ'ని తెలిపారు. 'మా శాఖ ఆ కంపెనీపై ఓ కన్నేసి ఉంచింద'ని అన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి