ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాలో దారుణం జరిగింది. విహారయాత్రకు వచ్చిన రష్యా యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడింది గెస్ట్ హౌస్ యజమానే కావడం గమనార్హం. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారానికి గురైనట్టు తేలిందన్నారు.