జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ప్రజలు రోడ్లపై గుంపులుగా కనిపించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎక్కువ మంది కలిసి వెళ్లాల్సి వస్తే తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లోనే స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా, అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.