గ్రామంలో ఆ దుకాణం లేకుంటే తమ భర్తలు దూరంగా వున్న మద్యం దుకాణానికి వెళతారని, అలా వెళ్లే సందర్భాల్లో ప్రమాదబారిన పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ప్రమాదం బారిన పడకుండా సురక్షితంగా వుండాలంటే గ్రామంలోనే అది ఉండటం మంచిదని కోరారు. కోర్టు ఆదేశాల నేపధ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాలను జనావాసాల నుంచి అధికారులు దూరంగా తరలిస్తున్నారు. ఈ నేపధ్యంలోలోనే తాజా ఆందోళన జరగడం గమనార్హం.