భారత జవాన్లు తొలిసారిగా సియాచిన్‌కు వెళ్లారంటే, అందుకు కారణం నరేంద్ర కుమారే. 1933లో ప్రస్తుతం పాకిస్థాన్ పరిధిలో ఉన్న రావల్పిండిలో జన్మించిన నరేంద్ర కుమార్, పర్వతారోహణలో సిద్ధహస్తుడు.
ఆ తర్వాత సియాచిన్ గ్లేసియర్ పక్కనే ఉన్న మరో ఎత్తయిన ప్రాంతమైన సాల్టోరో ప్రాంతంపైనా భారత్ పట్టు సాధించింది. ఇంకా చెప్పాలంటే, సాల్టోరో రేంజ్ ఎవరి అధీనంలో ఉంటుందో, వారికే సియాచిన్‌పై పట్టు లభిస్తుంది. పశ్చిమాన పాకిస్థాన్, తూర్పున చైనా దేశాల సరిహద్దుల మధ్య ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం ఇండియా అధీనంలోనే ఉంది. దీనికి కారణం నరేంద్ర కుమార్ చలువే.
కాగా, సియాచిన్‌కు వెళ్లే ముందు 1978లో ప్రపంచంలోని మూడో అతిపెద్ద పర్వతమైన కాంచనగంగను నరేంద్ర కుమార్ అధిరోహించారు. ఆయన సాధించిన ఘనతలను భావి తరాలకు తెలిపేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. నరేంద్ర కుమార్ మృతిపట్ల పలువురు సైన్యాధికారులు, ప్రముఖులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు.