అమెరికాలో తీవ్ర మంచు తుఫాను: 1000 విమానాల రద్దు

గురువారం, 27 నవంబరు 2014 (18:20 IST)
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్‌లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. 
 
నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి