ప్రధాని నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు సొరంగం...

శుక్రవారం, 30 మే 2014 (15:17 IST)
భారతదేశ ప్రధాన మంత్రి నివాసం నుంచి నేరుగా ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానాశ్రయానికి ఓ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమం నాలుగేళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కారణం భారత ప్రధాని తరచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు కనుక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సొరంగ మార్గం ద్వారా విమానాశ్రయానికి వెళ్లేందుకు సుళువైన మార్గంగా దీనిని ఎంచుకున్నారు.
 
ఇకపై ప్రధానమంత్రి విమానాశ్రయానికి సొరంగ మార్గం ద్వారా వెళ్లనున్నారు. ఈ సౌకర్యంతో ప్రధానికి భద్రత పెరగడంతోపాటుగా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోతాయి.

వెబ్దునియా పై చదవండి