ఈ నేపథ్యంలో... మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపైనే కాక, ఇస్లాం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముథాలిక్కు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ తరహా బెదిరింపులకు జడిసేది లేదని, హిందూ మత పరిరక్షణ కోసం పనిచేయకుండా తనను ఎవరూ ఆపలేరని ఆయన ప్రకటించారు.