భైరవ్ అనుకుని డైనోసార్‌ గుడ్లకు పూజలు చేశారు.. ఎక్కడ?

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (14:51 IST)
dinosaur
డైనోసార్‌ గుడ్లు అని తెలియకుండా ఆ గ్రామస్థులు వాటికి పూజలు చేసారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పడ్లియా గ్రామంలోని కుల దేవతలుగా భావించి కొన్ని రాళ్లకు గ్రామస్థులు గత కొన్నేళ్లుగా పూజలు చేస్తున్నారు. 
 
అయితే సైంటిస్టుల బృందం అవి డైనోసార్ గుడ్లని చెప్పడంతో షాకయ్యారు. అది తెలియక ఇన్నాళ్లు వాటికి పూజలు చేశామని షాకయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాకడ్ భైరవ్‌గా భావించి గుండ్రని రాళ్లను గ్రామస్తులు పూజలు చేశారు. ‘కాకడ్’ అని పిలిచే ఈ రాళ్లను పొలాల సరిహద్దుల్లో పూజిస్తారు. అయితే సైంటిస్టులు వాటిని పరీక్షించి అవి డైనోసార్ గుడ్లని తేల్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు