ఖగోళంలో అద్భుతం.. ఆగస్టు 30న బ్లూ మూన్

మంగళవారం, 29 ఆగస్టు 2023 (16:14 IST)
ఆకాశంలో అనేక గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. తరచుగా అద్భుతమైన ఖగోళ సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా, భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కొన్నిసార్లు వృత్తాకార మార్గంలో భూమికి దగ్గరగా వస్తాడు. తాజాగా ఖగోళంలో మరో అద్భుతం జరుగనుంది. 
 
చంద్రుడు నీలం రంగులో పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. దీనినే బ్లూ మూన్ అంటారు. ఈ బ్లూ మూన్ గత సంవత్సరం 2021 ఆగస్టు నెలలో కనిపించింది. ఆ తర్వాత ఈ ఏడాది (ఆగస్టు 30) ఈ బ్లూ మూన్ కనిపించనుంది. బుధవారం పౌర్ణమి రోజున ఈ బ్లూ మూన్ ప్రకాశవంతంగా ఉంటుంది. దీనిని ప్రజలు వీక్షించగలుగుతారు. 
 
ఈ సంవత్సరం పౌర్ణమి 7 డిగ్రీల మీనం రాశి ద్వారా ఆకాశాన్ని ఆగస్టు 30న సరిగ్గా 9:35 గంటలకు కనిపిస్తుంది. ఇకపోతే.. ఆగస్టు నెలలో ఇది రెండవ పౌర్ణమి.. క్యాలెండర్ నెలలో దీనిని రెండవ పౌర్ణమిని బ్లూ మూన్‌గా సూచిస్తారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు