తాజ్ మహల్‌కు మేకప్.. పాలరాతి రంగును కాపాడేందుకు ముల్తానీతో?

గురువారం, 6 ఏప్రియల్ 2017 (17:10 IST)
ప్రేమకు చిహ్నంగా.. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ మరమ్మత్తులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. తాజ్‌మహల్ చుట్టూగల ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ కాలుష్యం కారణంగా.. పొగతో పాలరాతి తాజ్‌మహల్ రంగు మారిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన ఆగ్రాలో వెలసిన సుప్రసిద్ధ తాజ్ మహల్‌కు మేకప్ వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మడ్ థెరపీ (Mud Therapy) చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. 
 
మడ్ థెరపీ అనే మహిళలు తమ అందాన్ని పరిరక్షించేందుకు వేసే మేకప్‌ల్లో ఒకటి. తాజ్‌మహల్‌పై మడ్ థెరపీ ద్వారా వేసే పూత ద్వారా తాజ్‌మహల్ రంగు మారదు. వాతావరణ కాలుష్యం ఏర్పడినా.. వాయుకాలుష్య ప్రభావంతో ఏర్పడే పొగతో తాజ్‌మహల్ రంగు మారకుండా ఈ థెరపీ కాపాడుతుందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి మహేష్ శర్మ తెలిపారు. 
 
ముల్తానీ మిట్టీ పేస్టుతో ఈ మేకప్ వేస్తారని.. ఇది తాజ్ మహల్ అసలు రంగును కాపాడుతుందని.. మహేష్ శర్మ తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను నేషనల్ ఎన్‌వైరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) సమర్పించిందని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి