జల్లికట్టుపై కమల్ హాసన్ వీడియో పోస్ట్.. ఏంటిది..? ఎవరైనా దీనిపై వివరించగలరా?

మంగళవారం, 24 జనవరి 2017 (11:43 IST)
జల్లికట్టుపై సినీ నటుడు కమల్ హాసన్ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జల్లికట్టు కోసం జరిగిన ఆందోళనలపై చెన్నైలోని స్థానిక న్యూస్‌ ఛానల్‌ ప్రసారం చేసిన వీడియోను ట్విట్టర్‌లో కమల్ పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఓ పోలీసు ఆటోకు నిప్పంటిస్తున్నట్లు కనిపిస్తోంది. 'ఏంటిది. ఎవరైనా వివరించగలరా' అంటూ కమలహాసన్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. 
 
మెరీనా బీచ్‌ నుంచి విద్యార్థులను పోలీసులు దౌర్జన్యంగా ఖాళీ చేయించడం మంచిది కాదని, అలాగే విద్యార్థులు కూడా ఇక ఆందోళన విరమించాలని కోరిన కమల్ హాసన్.. పోలీసులు దౌర్జన్యంతో మంచి ఫలితాలను ఆశించలేరన్నారు. కాగా.. జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని రద్దు చేయాలని చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న వారిని పోలీసుల ఖాళీ చేయించే ప్రయత్నం చేయడంతో నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. కానీ సోమవారం సాయంత్రం తమిళనాడు శాసనసభ అత్యవసరంగా సమావేశమై ముసాయిదా బిల్లును ఆమోదించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి.

What is this. Please explain some one pic.twitter.com/MMpFXHSOVk

— Kamal Haasan (@ikamalhaasan) January 23, 2017

వెబ్దునియా పై చదవండి