పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెకు కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆమె మృతిచెందడంతో బిడ్డను చెత్త కుండీలో పడేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యుల్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సమయంలో వారి ఇంట్లో ఉన్న సమీప బంధువైన యువకుడికి మంగయ కరసి దగ్గరైంది. ఇద్దరు చనువుగా ఉన్నా, కుటుంబీకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం, ఆ యువకుడు మంగయకరసికి తమ్ముడి వరుస కావడమే.
అయితే, వీరు శారీరకంగా కలవడంతో మంగయ కరసి గర్భం దాల్చడం, అబార్షన్ కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కుటుంబం బయటకు తెలిస్తే పరువు పోతుందని.. ఆమెకు ఇంట్లోనే ప్రసవం చేశారు. కానీ ప్రమాదవశాత్తు మంగయ చనిపోయింది. కాగా కుటుంబీకులు బిడ్డను చెత్త కుండీలో వేయడంతో అసలు విషయం బయట పడింది.