టార్గెట్ హిడ్మా - జాయింట్ ఆపరేషన్ ప్రారంభం

శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (12:21 IST)
మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న హిడ్మా కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇందుకోసం తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. 
 
నిజానికి హిడ్మా లొంగిపోయారంటూ ఈ రెండు రాష్ట్రాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ, పోలీసులు మాత్రం ఈ వార్తలను ధృవీకరించడం లేదు. కానీ, ఒక పథకం ప్రకారం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తునే ప్రచారం సాగుతోంది. అదేసమయంలో హిడ్మాను లక్ష్యంగా చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 
 
తాజాగా పోలీసులు విడుదల చేసినట్టు చెబుతున్న ఓ ప్రకటనలో మాడవి హిడ్మా లొంగిపోయాడని, అతనికి 25 యేళ్ళు ఉంటాయని పేర్కొన్నారు. స్వగ్రామం సుక్మా జిల్లా కిష్టాపురం మండలం తొండమార్క గ్రామంగా పేర్కొన్నారు. 
 
అయితే, జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, గెరిల్లా బెటాలియన్ కమాండర్ హిడ్మా స్వగ్రామం మాత్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామం అని, అతని వయసు 45 యేళ్లుగా ఉంటాయని పేర్కొన్నారు. 
 
పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ప్రటించిన రెండు పేర్లూ ఒకే విధంగా ఉండటంతో హిడ్మా లొంగుబాటుపై స్పష్టత రాలేదు. పైగా, పోలీసులు కూడా ఈ అంశంపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు, హిడ్మా కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు