పఠాన్‌కోట్‌లో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు: ఇద్దరు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హతం!

శనివారం, 2 జనవరి 2016 (11:24 IST)
పంజాబ్‌లోని భారత కీలక స్థావరమైన పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు
ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన శనివారం ఉదయం 3.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ముందుగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. అనంతరం కాల్పులు ప్రారంభించారు, కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. 
 
పరిస్థితి తీవ్రం కావడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), గరుడ కమాండో ఫోర్స్‌ను రంగంలోకి దించారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని.. వీరిలో నలుగురు హతమైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బేస్‌లోకి చొరబడ్డ మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి