బూటులో బుసకొట్టిన నాగుపాము: సోషల్ మీడియాలో వీడియో వైరల్!

మంగళవారం, 19 జులై 2016 (10:40 IST)
వర్షాకాలంలో ఇంట్లోకి పాములు, పురుగులు వచ్చేస్తాయి. అలా షూలో నాగుపాము వచ్చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. షాక్ తప్పదు కదా.. అదే మరి. ఆఫీసుకు టైమవుతుందని టిప్ టాప్‌గా రెడీ అయి షూ వేసుకుందామని చెప్పుల స్టాండు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి దానిలో ఓ నాగుపాము ఉండటం చూసి షాక్ అయ్యాడు. బూటులో చిన్న నాగుపాము పడగ విప్పి నాట్యం చేయడం చూసిన వ్యక్తి వెంటనే తేరుకొని జేబులో ఉన్న తన స్మార్టు ఫోన్ తీసి వీడియో తీశారు. 
 
వర్షాకాలం కావడంతో ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ చిన్న నాగుపాము వచ్చి బూటులో హాయిగా నిద్రపోయింది. షూ కదిలించగానే బూటులోనే బుసకొడుతూ డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత తన దారేంటో చూసుకుని వెళ్ళిపోయింది. బూటూలో నాగుపాము డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో సదరు వ్యక్తి అప్ లోడ్ చేయడంతో లైకులు వెల్లువెత్తుతున్నాయి. షేర్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ వీడియో జూలై 13వ తేదీన యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి