ఈ ఘటన పాట్నా రైల్వేస్టేషన్‌లో కనిపించింది. కంటికి రెప్పలా కాచిన తల్లి, మరణించిందని తెలియని చిన్నారి ఆమెను లేపేందుకు యత్నిస్తూ.. లేవమని అల్లరి చేస్తూ.. దుప్పటి లాగుతున్న ఈ హృదయ విదారకమైన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో సోమవారం 23 ఏళ్ల మహిళ తన బిడ్డతో కలిసి బీహార్‌లోని ముజఫర్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంది. తీవ్రమైన ఎండ, ఆకలితో శరీరం డీహైడ్రేషన్‌కు గురవడంతో.. ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఈ విషయం తెలియని చిన్నారి ఆమెను లేవమని దుప్పటిని లాగుతున్నాడు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆహారం, నీరు అందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం అందించకపోయినా పరవాలేదు కాని ఎండాకాలం కావడంతో దాహంతో నోరు ఎండిపోతుందని, కనీసం నీరైనా అందించాలని వారు కోరుతున్నారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరువగా నమోదౌతున్న సంగతి తెలిసిందే.