రాజన్ హత్య కేసు: లాలూ చిన్న కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం నోటీసులు

శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:23 IST)
జర్నలిస్టు రాజ్‌‌దేవ్‌ రాజన్ హత్య కేసు నిందితుడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలపై.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు బీహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. తాజాగా ఈ కేసులో బీహార్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజన్ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా శివాన్ ఎస్పీని ఆదేశించింది. 
 
ఇకపోతే.. జర్నలిస్టు హత్య కేసులో నిందితుడైన కైఫ్‌తో తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌తో కలిసి ఉన్న ఫోటోలు బయట పడడంతో పెను ధూమారం రేగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కైఫ్‌ పోలీసులకు లొంగిపోయాడు. కానీ తన భర్తను చంపినవారికి తేజ్‌ ప్రతాప్‌ ఆశ్రయం ఇచ్చారంటూ రాజన్ భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టు హత్య కేసులో అనుమానితుడైన షూటర్‌తో కలిసి ఉన్న ఫోటోపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసు పంపింది.

వెబ్దునియా పై చదవండి