దీనికి కారణం... రజనీకాంత్‌కు సర్పదోషం ఉండటమేనట. మకరరాశికి చెందిన రజనీ సింహలగ్నంలో జన్మించడం వల్ల ప్రత్యర్థులెవ్వరూ పోటీ పడి ఆయనను ఓడించలేరు. అయితే, రజనీ.. తన సన్నిహితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారివల్ల చెడు జరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో రజనీ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోకుండా, పార్టీ నాయకుడిగా ఉండి "కింగ్‌మేకర్''గా వ్యవహరించాలని సలహా ఇచ్చారు.
కాగా, డిసెంబర్ 31వ తేదీన రాజకీయాల్లోకి రావనున్నట్టు రజనీకాంత్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత "రజనీ రసిగర్ మండ్రం" పేరుతో ఓ వెబ్‌సైట్, యాప్‌ను ప్రారంభించి, సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. అనంతరం జాతీయ మీడియాకు ధన్యవాదులు తెలిపేందుకు ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. తదుపరి డీఎంకే చీఫ్ కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇలా రజనీకాంత్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.