మాస్క్ పెట్టుకుంటే బ్యూటీపార్లర్‌కు ఎలా వెళ్తారు?: అస్సాం మంత్రి

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (15:23 IST)
దేశంలో కరోనా వైరస్ కోరలు చాసింది. అనేక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నాయి. అదేసమయంలో వైరస్  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్యులు నెత్తినోరు బాదుకుంటూ చెప్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో అస్సాం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వా మాత్రం మాస్కులు పెట్టుకునే అవ‌స‌రం లేదంటూ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు మాస్కులు పెట్టుకుని భయాలను పెంచుతున్నారన్నారు. 
 
త‌మ రాష్ట్రంలో ఇప్పుడు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ప్రజలు మాస్క్ లు ఎప్పుడు పెట్టుకోవాలో తాము తెలియజేస్తామని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాము ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించాల్సి ఉంద‌ని తెలిపారు. 
 
మాస్కులు పెట్టుకుంటే బ్యూటీ పార్లర్‌కు ఎలా వెళ్లగలమని ఆయ‌న ప్రశ్నించడం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌ ఎవరికైనా కరోనా సోకింద‌ని అనుమానం వ‌స్తే అప్పుడే వారు మాస్కు పెట్టుకోవాలని ఆయ‌న సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు