ఉత్తరాదిన ప్రభుత్వ వైద్యులు, వైద్య శాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రులకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వుండటంతో.. నిరుపేదలు మరణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ వైద్యుడు 17 మంది మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. మత్తు మందు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయాడు. మహరాజ్ గంజ్ బ్లాకులోని జాన్ పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 17 మంది మహిళలకు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలకు మేరకు వైద్యసిబ్బంది మత్తు ఇచ్చారు. అయితే ఆపరేషన్ చేసేందుకు అవసరమైన సామాగ్రి లేదని ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపైనా డాక్టర్ రాకపోవడంతో మహిళల బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి నిర్వాకం స్పందించి ప్రవీణ్ కుమార్‌ను రప్పించింది.