విద్యార్థులా.. పచ్చి గూండాలా? కేవీ విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు.. వీడియో వైరల్

శుక్రవారం, 14 అక్టోబరు 2016 (14:16 IST)
బజారు రౌడీల్ని తలపించేలా విద్యార్థులు నడుచుకున్నారు. క్లాస్ రూమ్‌లోనే అమానుషంగా నడుచుకున్నారు. ఒక్క విద్యార్థిని పట్టుకుని ఆరుమంది విద్యార్థులు చితకబాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. విద్యార్థులు ధరించిన యూనిఫాంను బట్టి చూస్తే మాత్రం.. అదో కేంద్రీయ విద్యాలయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వీడియో చేరేవరకు ఫేస్ బుక్, వాట్సాప్‌లలో ఫార్వార్డ్ చేయాలంటూ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. తోటి విద్యార్థుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిన సదరు విద్యార్థులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
 
అయితే స్కూలు పేరును బయటపెట్టని టీచర్లు సదరు విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిపై చేజేసుకున్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీహార్‌ టౌన్, గన్నీపూర్ ప్రాంతంలోని ఓ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి