ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగులైతే పింఛను ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయనేది వారి ఆలోచన. కరోనా లాక్‌డౌన్, తర్వాత పరిస్థితుల్లో అనేక మంది చనిపోగా, ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు కాలేదు. వారి బ్యాంక్ అకౌంట్లు, రావాల్సిన పింఛన్లు యథావిధిగా వచ్చాయి.
అంతేకాక, చనిపోయిన వారి ఆధార్, బ్యాంకు అకౌంట్లు ఆక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.