హోలీ సంబరాల్లో విషాదం.. ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో అగ్నిప్రమాదం.. 13 మందికి గాయాలు

వరుణ్

సోమవారం, 25 మార్చి 2024 (10:36 IST)
హోలీ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆలయంలో భస్మ హారతి సందర్భంగా గర్భ గృహలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం 5.50 గంటలకు జరిగిన 'భస్మ హారతి' సమయంలో జరిగింది. హోలీ వేడుకల మధ్య 'కపూర్ ఆరతి' ప్రారంభించాల్సిన సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ స్పందిస్తూ, 'గర్భగృహ'లో భస్మ హారతి సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మందికి గాయాలు కాగా... వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎనిమిది మందిని ఇండోర్‌కు తరలించారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం' అని తెలిపారు. 
 
కాగా, ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో అగ్నిప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో మాట్లాడారు. ఈ విషయాన్ని హోం మంత్రి షా తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. 'నేను సీఎం మోహన్ యాదవ్‌తో మాట్లాడాను. అగ్ని ప్రమాదం గురించి సమాచారాన్ని సేకరించాను. స్థానిక పరిపాలన గాయపడిన వారికి అన్ని సహాయం, చికిత్స చేయించాలని ఆదేశించాను' అని పేర్కొన్నరు. పైగా, ఇది దురదృష్టకర ఘటనగా ఆయన అభివర్ణించారు. 
 
“భస్మ హారతి సమయంలో మహాకాల్ ఆలయంలోని 'గర్భగృహ'లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఉదయం నుంచి పరిపాలనతో టచ్‌లో ఉన్నాను. అంతా అదుపులో ఉంది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని బాబా మహాకాల్‌ని ప్రార్థిస్తున్నాను" అని యాదవ్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో రాశారు. మతపరమైన వేడుకలో భాగంగా 'గులాల్' (ఆచారాలు మరియు హోలీ సమయంలో ఉపయోగించే రంగు పొడి) విసురుతుండగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు