ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లో కొత్తగా ఓ వంతెన నిర్మిస్తున్నారు. ఇందులో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అర్థరాత్రి సమయం కావడం ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన అధికారులు, శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఫ్లై ఓవర్ ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిపోయిందని, దీనికారణంగానే ఈ ప్రమాదం సంభవించివుంటుందని ఓరియంటల్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ అభిప్రాయపడ్డారు.