తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు కామాంధులు బలవంతంగా చెరకు తోటలోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమె నాలుక కత్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు.
అయితే, ఆ బాలిక కళ్లను పొడిచినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కాలేదని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.