బీహార్లో ఓ విచిత్రమైన ఘోరం జరిగింది. తన భార్యకు మగ పిల్లవాడు జన్మించలేదని, దానికి కారణం తానే అంటూ కోపంతో తన అంగాన్ని తానే కత్తితో కోసుకుని మృత్యువాత పడ్డాడు ఓ వ్యక్తి. బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఇంటికి వచ్చిన తర్వాత మగబిడ్డ కావాలంటూ ఎప్పట్లాగే భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవలో భార్యాభర్తల మధ్య ఎలాంటి వాగ్యుద్ధం జరిగిందో కానీ అతను ఆవేశంలో తన పురుషాంగాన్ని పదునైన చాకుతో కోసేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోసేసిన మర్మాంగం ఏమైపోయిందో వివరాలు తెలియ రావడం లేదని పోలీసులు తెలిపారు.