అమీర్ వ్యాఖ్యలు బాధించాయి.. భారత్‌లో సహనం ఎక్కువ: వెంకయ్య

బుధవారం, 25 నవంబరు 2015 (11:16 IST)
భారత దేశంలో సహనం ఎక్కువ, భారత ప్రజలు సహనపరులని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన ఘర్షణలు తగ్గుతూ వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో మత అసహనం ఎక్కువైందంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తమనెంతో బాధించాయని చెప్పారు. దురదృష్టవశాత్తో, తెలిసో, తెలియకో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయన్నారు. 
 
అలాగే అమీర్ ఖాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించడం పట్ల వెంకయ్య మండిపడ్డారు. కొంతమంది ప్రజలు తప్పుదోవలోకి మళ్లించబడితే, మరికొంతమంది తప్పుదోవపడుతున్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈ కేటగిరీలోకి వచ్చిన వారిని తాను నేరుగా ప్రస్తావించనని పేర్కొన్నారు. అయితే ఇతర దేశాల్లో కూడా లేని చక్కటి పరిస్థితిలు భారత్‌లో ఉన్నాయని మాత్రం చెప్పగలనని వెంకయ్య నాయుడు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి