భారత నావికాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం నేవీ చీఫ్ ఆర్. హరికుమార్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ కాబోతున్నారు. ఆయన స్థానంలో తదుపరి నేవీ ఛీప్‌గా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్‌ను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠి 1985 జూలై ఒకటో తేదీన నేవీలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో తన కెరీర్‌ను కొనసాగించారు.
కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ యుద్ధరీతుల నిపుణుడైన త్రిపాఠి తన 39 యేళ్ల సుధీర్ఘ కేరీర్‌లో పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. వైస్ అడ్మిరల్ కాకమునుపు ఆయన వెస్ట్రన్ కమాండ్ అధిపతిగా, ఫ్లాగ్ ఫీసర్‌గా ఉన్నారు. రేవాలోని సైనిక్ స్కూ్, ఖడక్వసాలాలోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చదువుకున్న ఆయన వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో, నేవల్ వార్ కాలేజీ (గోవా), యూఎస్ నేషనల్ కాలేజీల్లో పలు కోర్సులు పూర్తి చేశారు.
దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని యువతకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఆరు భాషల్లో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ చేశారు. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. యువతి, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సందేశమిచ్చారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నిక మొదటి దశ పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ దశలో మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత, తొలిసారి ఓటు హక్కును వినియోగించేవారు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరారు. ఈ మేకు తొలి దశ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి గొంమతు ముఖ్యమైనదేనని వ్యాఖ్యానించారు.
2024 లోక్‌సభ ఎన్నికలు ఈ రోజు ప్రారంభమవనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 21 రాష్ట్రాలు, కేందర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాల్లో ఓటు హక్కు ఉన్నవారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటు వేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా, యువత తొలిసారి ఓటర్లు ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను. ఎంతైనా ప్రతి ఓటు విలువైనదే. ప్రతి గొంతు ముఖ్యమైనదే అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.