కన్యత్వ పరీక్షకు శాస్త్రీయత లేదని, ఒకవేళ అలాంటి పరీక్ష మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షకు ఖచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనమే లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు క్రైస్తవ సన్యాసి మృతి కేసులో కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.
కన్యత్వ పరీక్షకు ఖచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనే లేదని, అయినప్పటికీ ఈ పరీక్షలు మహిళల స్వచ్ఛతకు చిహ్నంగా మారిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అమానుషమన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ పరీక్షలకు శాస్త్రీయత లేదని చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.