ప్రజలు రైల్వే స్టేషన్లలోకి వచ్చినప్పుడు, రైళ్లలో, రైల్వే పరిసరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తాము జారీచేసిన నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
* భౌతికదూరం పాటించాల్సిందే.
* కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా రైల్వే స్టేషన్లకు రావొద్దు. రైళ్లలోకి ప్రవేశించొద్దు.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా, చెత్తాచెదారం విసిరేసినా కఠిన చర్యలు.
* రైల్వే స్టేషన్లు/ రైళ్లలో అపరిశుభ్ర వాతావరణం సృష్టించి.. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దు.