మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు ఆమెను చితకబాదారు. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇంత దారుణంగా ఓ మహిళను కొట్టడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్, అజ్మీర్ నగరంలోని అంబేద్కర్ కాన్సీ అనే గ్రామంలోని ఓ మహిళకు ఇద్దరు సంతానం. ఆ మహిళ గ్రామంలోని పలువురు మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకుంది. దీనిని ఆ మహిళ భర్త తీవ్రంగా ఖండించాడు.
ఎంత చెప్పినా ఆమెలో మార్పు రాకపోవడంతో పంచాయతీలో ఫిర్యాదు చేశాడు. ఇంకా ఈ మహిళ వాలకం ద్వారా పలువురు పురుషులు, యువకులు కూడా బాధితులైయ్యారని ఫిర్యాదులు రావడంతో.. ఆమెను ఇంటి నుంచి జుట్టు పట్టుకొచ్చిన మహిళలు జుట్టు కత్తిరించి చెట్టుకు కట్టేశారు. అంతేగాకుండా చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనను అడ్డుకుని ఆమెను కాపాడారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.