ఈ ఉత్తర్వులు డిసెంబరు 10వ తేదీ వరకు అమలులో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా ప్రకటించారు. అయోధ్యలో డ్రోన్ల ఉపయోగం, వీడియో చిత్రీకరణపైనా నిషేధం విధించారు. తమ అనుమతి లేకుండా దీపావ ళి టపాసుల విక్రయం, కొనుగోళ్లు కుదరదన్నారు.
మరోవైపు యూపీ వక్ఫ్‌బోర్డు చైర్‌పర్సన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీకి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణలో భాగంగా అయోధ్య వివాదంపై సుప్రీం ధర్మాసనం సోమవారం 38వ రోజు వాదనలు విన్నది. ముస్లింల తర ఫు న్యాయవాది రాజీవ్ ధావన్ ధర్మాసనాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.