పెళ్లి రద్దు చేసుకున్న మహిళా వైద్యురాలు.. ఎందుకో తెలుసా..?
శనివారం, 8 మే 2021 (14:43 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తి జీవితాలలోని సంతోషాలను దూరం చేసుకుకి సైతం కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
చాలా రోజులు కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు ఉన్నారు. తాజాగా కరోనా వేళ ఓ మహిళా వైద్యురాలు తన జీవితంలో మదురైన ఘట్టాన్ని రద్దు చేసుకుంది. కరోనా కాలంలో పెళ్లి రద్దు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ఇండియా కార్డియాలజీ ఆస్పత్రిలో అపూర్వ మంగళగిరి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అపూర్వ వివాహం ఏప్రిల్ 26 జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో అపూర్వ కుటుంబ సభ్యులు పెళ్లి జరపడానికి సిద్దంగా లేరు.
దీంతో పెళ్లి వాయిదా వేసే ప్రపోజల్‌ను వరుడి కుటుంబం ముందు ఉంచారు. అయితే వరుడి కుటుంబం పెళ్లి తేదీని వాయిదా వేసేందుకు నిరాకరించింది. అయితే మహిళా వైద్యురాలు అపూర్వ మాత్రం కరోనా రోగులకు సేవ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంది.