ముంబైకు చెందిన ఓ మహిళ దుబాయ్లో పని చేస్తోంది. ఇటీవల ఆమె సెలవుపై ముంబైలో ఉంటున్న భర్త వద్దకు వచ్చింది. భర్త ఉండే అపార్ట్మెంట్లోనే ఆమె అన్నయ్య, తండ్రి కూడా కలిసివుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం భర్త ఆమెను వదిలి బిజినెస్ పనిమీద వెళ్లాడు. తండ్రి, అన్నయ్య చేదోడువాదోడుగా ఉంటారనుకుంటే.. అన్నయ్య నుంచి ఈ వింత పరిస్థితి ఎదురైంది.
రెండు వారాలుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మాటలతో చిత్రవధ చేస్తూ వచ్చాడు. భర్త లేడు కదమ్మా.. రా.. సంతోషంగా ఉందాం అంటూ మాటలతో వేధించ సాగాడు. భర్తతో శారీరకంగా దగ్గరవుతున్న నీకు నాతో కలిస్తే ఏమవుతుందంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. అతని మాటలను జీర్ణించుకోలేని ఆమె... తండ్రితో కలిసి డోంగ్రీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.