ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ దేశానికి చెందిన ఓ మహిళ మోసపోయింది. ఓ టెక్కీతో సహా నలుగురు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైంది. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసం చేయలేకపోయింది. తనకు ఆశ్రయం కల్పించిన మహిళా స్నేహితురాలే కామాంధులతో చేతులు కలిపి మోసం చేసింది. దీంతో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో ఫిర్యాదు చేసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌కు చెందిన 22 యేళ్ళ మహిళ 2018లో లక్నోలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. ఆమె ప్రవీణ్ రాజ్‌పాల్ యాదవ్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నేపాల్ మహిళకు పరిచయం చేసింది. వీరిద్దరూ కొంతకాలం పాటు సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి ఆ మహిళకు మత్తుమందు తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం పోలీసులకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. స్నేహితురాలికి చెప్పినా పట్టించుకోలేదు. ఇక చేసేది లేక తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బాధితురాలు చేరుకుంది. కేసు నమోదుచేసిన పోలీసులు ఆమెను బందోబస్తు నడుమ లక్నోకు తీసుకుని బయలుదేరారు.