వాట్సాప్‌లో 12 నిమిషాల గ్యాంగ్ రేప్ వీడియో సంచలనం సృష్టించింది. కేరళలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు 15ఏళ్ల తోటి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అయితే ఈ ఉదంతాన్ని ఎవరికీ చెప్పకుండా తనలో దాచుకున్న ఆ బాలిక.. వాట్సాప్‌లో తనను ముగ్గురు స్టూడెంట్స్ రేప్ చేసిన ఉదంతమంతా బట్టబయలుకావడంతో షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
గార్డియన్లకు కూడా ఈ విషయం చెప్పకుండా సైలెంట్‌గా దాచేసిన ఆ బాలికకు.. తన అత్యాచారానికి సంబంధించిన వీడియో నెట్లో రావడం చూసి షాక్ తింది. ఈ వీడియోను వాట్సప్ ద్వారా బాధితురాలి అత్త రిసీవ్ చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు రేపిస్టులను అరెస్ట్ చేశారు.