అయితే ఈ విషయంలో యడ్డ్యూరప్ప కాస్త వెనక్కి తగ్గారు. బాణసంచాను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, అందువల్ల వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవాలని యడ్డ్యూరప్ప తెలిపారు. గ్రీన్ క్రాకర్స్ కాల్చడం ఎలాంటి అభ్యంతరం లేదని తెలి పారు.
బాణసంచా తయారుచేసే కంపెనీలు కూడా పర్యావరణానికి హాని కలగని వాటినే తయారు చేయాలని, అలాంటి వాటినే అమ్మాలని తెలిపారు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీపావళి జరుపుకోవాలని తెలిపారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.