చెన్నై దినమలర్ వార్తాపత్రికకు ఉగ్రదాడి వార్నింగ్!

బుధవారం, 28 జనవరి 2015 (18:14 IST)
చెన్నైలోని దినమలర్ వార్తా పత్రికకు ఉగ్రవాద దాడి పొంచివుంది. ‘నిన్న చార్లీ హెబ్డో.. రేపు దినమల్లార్’ అంటూ చెన్నైలోని దినమలర్ వార్తా పత్రికకు ఉగ్రదాడి హెచ్చరికలతో ఓ లేఖ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు అప్రమత్తమై దినమలర్ వార్తా పత్రిక కార్యాలయం వద్ద తనిఖీలు చేపట్టారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
అయితే లేఖ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ పేరుతో కోయంబత్తూరు నుంచి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి