ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రామ్‌నాయక్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. యోదితో పాటు ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 47 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు ఉపముఖ్యమంత్రులయ్యారు. 22 మందికి కేబినేట్ హోదా, 9 మంది మంత్రులకు స్వతంత్ర హోదా లభించింది. మొహసిన్ రజాకు మంత్రి పదవినివ్వడం ద్వారా యోగి.. మైనారిటీలకు స్థానం కల్పించినట్లైంది.
మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కు కూడా మంత్రి పదవి లభించింది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ, అద్వానీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్, సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, తదితరులు హాజరయ్యారు.
విన్‌డీజిల్, యోగి పుట్టగానే హాస్పిటల్ నుంచి వారిద్దరినీ వేరుచేశారని, యూపీ సీఎం అవుతున్నందుకు కంగ్రాట్స్ విన్‌డీజిల్ అంటూ కామెంట్స్ చేశారు. మరో నెటిజనైతే యోగి ఏకంగా దీపిక పదుకొణెతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ట్వీట్లు చేశాడు.