రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తే గ్యాంగ్ రేప్ చేశారు, ఆపై ఆమె కరోనాతో మృతి

మంగళవారం, 11 మే 2021 (10:41 IST)
గత నెల దేశ రాజధానిలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన 25 ఏళ్ల ఉద్యమకారిణిపై కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... గత నెల ఏప్రిల్ 11న ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యామానికి మద్దతు తెలిపేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల మహిళా సామాజిక కార్యకర్త వచ్చింది. ఆ రోజు రైతుల నిరసనలో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది.
 
మార్గమధ్యంలో తనతో కలిసి వస్తున్న కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనితో ఆమె తీవ్ర జ్వరం, అస్వస్థతకు లోనైంది. రాజధానిలో జగ్గార్ ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు ఆమెకి కరోనా సోకినట్లు నిర్థారించారు. చికిత్స తీసుకుంటున్న బాధితురాలు ఏప్రిల్ 30వ తేదీన కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
కాగా చనిపోయే ముందు బాధితురాలు తన పరిస్థితిని తండ్రికి వివరించింది. అలాగే తనపై జరిగిన సామూహిక అత్యాచారం విషయాన్ని కూడా తండ్రితో చెప్పడంతో ఆయన హరియాణా పోలీసుకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు