ఎన్ఆర్‌హెచ్ఎం స్కాంలో మరో నాలుగు కేసులు!

శనివారం, 25 ఫిబ్రవరి 2012 (09:51 IST)
గతంలో ఉత్తరప్రదేశ్‌‍లో వెలుగుచూసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్‌హెచ్ఎం) కుంభకోణానికి సంబంధించి తాజాగా సీబీఐ శుక్రవారం మరో నాలుగు కేసులను నమోదు చేసింది. కుంభకోణం జరిగిన సమయంలో ఉన్న ముఖ్య వైద్య అధికారులు (సీఎంవో)లు ప్రైవేట్ పంపిణీ అధికారులతో కుమ్మకై జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులను కొలగొట్టారన్న ఆరోపనలపై కేసులు నమోదైనాయి.

అంతేకాకుండా సీబీఐ అధికారులు ఉత్తరప్రదేశ్‌లోని 22 జిల్లాలోని 30 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా సీఎంవో కార్యాలయాలు, నివాసాలు, ప్రైవేట్ దుకాణాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ధరణీ మిశ్రా వెల్లడించారు.

సీఎంవోలు, కొన్ని ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టలు కట్టబెట్టడంలో భారీ అక్రమాలకు పాల్పడారని ఆరోపణలు ఉన్నాయి. వివిధ జిల్లాలోని ప్రవేట్ సంస్థల వ్యక్తులు అధికారుల్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తుందని, పలు ప్రైవేట్ సంస్థలు అధికారులతో కుమ్మక్కై అధిక ధరలకు నాసిరకం మందులను సరఫరా చేస్తున్నట్లు గుర్తిచామన్ని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి