నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.. పూజకు అవసరమైన ముఖ్యవస్తువులేంటి?
గురువారం, 15 అక్టోబరు 2015 (19:54 IST)
నిత్యపూజలు చేసేవారైనప్పటికీ ముఖ్యమైన పర్వదినాలు, వ్రతాలు శుభకార్యాలు జరిగేటప్పుడు ఏదో తెలియని హడావుడితో కొన్ని వస్తువులు మర్చిపోతూ, వాటికి అప్పుడప్పుడు మధ్యలో లేచి వెళుతూ ఉంటారు. కొన్ని తెలియకకూడా పోవచ్చు. అందువల్ల ఈ క్రింది వస్తువులను ముందుగానే అమర్చుకుంటే మనం చేసే కార్యక్రమం మీద మనస్సు లగ్నం చేసుకున్నవారమవుతాము.
* పూజవేళ ఉపయోగించుటకుగాను విడివిడిగా పాత్రలలో జలము, ఉద్ధరిణెలు లేదా చెంచాలు కావాలి
* ఏ దైవమును పూజించుచున్నామో ఆ దైవము యొక్క చిత్ర పటము లేదా ప్రతిమ, అదికూడా లేనప్పుడు బంగారు లేదా వెండితో చేసిన కాసు.
* ముఖ్యముగా వినాయక, వరలక్ష్మీ పూజకు పాలవెల్లి కట్టితీరాలి
* దీపారాధనకు కుందులు, ప్రత్తితో చేసిన వత్తులు, ఆవు నెయ్యి, అవి వెలిగించుటకు ఒక అగ్గిపెట్టె, ధూపారాధనకు సాంబ్రాణి.